Supreme Court Collegium: తెలుగు రాష్ట్రాల్లోని హైకోర్టులకు త్వరలోనే మరి కొందరు కొత్త జడ్జీలు రానున్నారు.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ హైకోర్టులకు జడ్జీల నియామకానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది.. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిగా తుహిన్ కుమార్ పేరు సిఫార్సు చేసిన సుప్రీంకోర్టు కొలీజియం.. తెలంగాణ హైకోర్టుకు నలుగురు జడ్జీల నియామకానికి సిఫార్సు చేసింది.. టీజీ హైకోర్టుకు జడ్జీలుగా గాడి ప్రవీణ్ కుమార్, గౌస్ మీరా మోహిఉద్దిన్, సుద్దాల చలపతి రావు, వాకిటి రామకృష్ణా రెడ్డి పేర్లను సిఫార్సు చేసింది సుప్రీంకోర్టు కొలీజియం..
Read Also: Piracy: సినిమాలను ఎక్కడి నుంచి పైరసీ చేస్తున్నారు..? దీని వెనుక పెద్ద నెట్వర్క్ ఉందా..?
సుప్రీంకోర్టు కొలీజియం న్యాయవాది తుహిన్ కుమార్ గేదెలను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమించాలని సిఫార్సు చేసింది. జూలై 2న జరిగిన సమావేశంలో, భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) బీఆర్ గవై నేతృత్వంలోని న్యాయమూర్తులు సూర్యకాంత్ మరియు విక్రమ్ నాథ్‌లతో కూడిన కొలీజియం ఈ నియామకాన్ని సిఫార్సు చేసింది. జూలై 1 నాటికి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 37 మంది న్యాయమూర్తులు ఉండాలి.. కానీ, 9 మంది పోస్టులు ఖాళీగా ఉండడంతో 28 మంది న్యాయమూర్తులతో పనిచేస్తున్నారు.
Read Also: Cheating Trade: ట్రేడింగ్ పేరుతో బోర్డు తిప్పేసిన అద్వికా ట్రేడింగ్ కంపెనీ.. లబోదిబోమంటున్న బాధితులు
ఇక, సుప్రీంకోర్టు కొలీజియం తెలంగాణ హైకోర్టుకు నలుగురు న్యాయవాదులను న్యాయమూర్తులుగా నియమించాలని సిఫార్సు చేసింది. గౌస్ మీరా మొహియుద్దీన్, చలపతి రావు సుద్దాల. వాకిటి రామకృష్ణ రెడ్డి, గాడి ప్రవీణ్ కుమార్ పేర్లను సిఫార్సు చేసింది.. తెలంగాణ హైకోర్టులో 42 మంది న్యాయమూర్తులు ఉండాల్సి ఉండగా.. అయితే ప్రస్తుతం 26 మంది న్యాయమూర్తులతో పనిచేస్తోంది. దీంతో, తాజాగా మరో నలుగురు జడ్జీల నియామనికి సిఫార్సు చేసింది కొలీజియం..