OPPO Reno 14: సుపరిచిత స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఒప్పో (OPPO) తాజాగా Reno 14 సిరీస్ ను భారత్‌లో లాంచ్ చేసింది. ఇందులో Reno 14, Reno 14 Pro మోడల్స్ విడుదలయ్యాయి. ఇదివరకు విడుదలైన Reno13 మోడల్ కు అప్డేటెడ్ వర్షన్ గా తీసుక వచ్చారు. ఇదివరకు మొబైల్స్ లో వదిన క్వాడ్ కర్వ్ డిస్ప్లేకి బదులుగా.. ఈ సిరీస్ ఫోన్లలో ఫ్లాట్ AMOLED డిస్ప్లేను ఉపయోగించారు. ఇందులో AI ఆధారిత కెమెరా ఫీచర్లు, అద్భుతమైన బ్యాటరీ లైఫ్ వినియోగదారులను ఆకట్టుకునేలా ఉన్నాయి. మరి OPPO Reno 14 సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్స్ ను ఒకసారి చూసేద్దామా..
డిస్ప్లే, డిజైన్:
Reno 14లో 6.59-అంగుళాల ఫ్లాట్ OLED డిస్ప్లే ఉంది. అలాగే ఇందులో 1.5K AMOLED స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్, 3840Hz PWM డిమ్మింగ్, గొరిల్లా గ్లాస్ 7i రక్షణ లభిస్తుంది.
Read Also:OPPO Pad SE: తక్కువ ధరలో స్టైలిష్ డిజైన్, భారీ బ్యాటరీ, అధునాతన ఫీచర్లతో ఒప్పో ప్యాడ్ SE లాంచ్.. ఫీచర్లు ఇవే..!
పెర్ఫార్మెన్స్, ప్రాసెసర్:
ఈ Reno 14లో MediaTek Dimensity 8350 (4nm) చిప్సెట్ ను వినియోగించారు. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 15 పై ColorOS 15తో పని చేస్తుంది. ఇక ఇందులో 12GB వరకు RAM, 512GB వరకు స్టోరేజ్ లభిస్తుంది.
బ్యాటరీ, ఛార్జింగ్:
ఈ కొత్త ఒప్పో మొబైల్లో 6000mAh బ్యాటరీ ఉంది. దీనికి 80W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ లభిస్తుంది.
కెమెరా ఫీచర్లు:
* 50MP ప్రైమరీ కెమెరా (OIS సపోర్ట్‌తో)
* 50MP 3.5X పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా
* 8MP అల్ట్రా వైడ్ కెమెరా
* 50MP సెల్ఫీ కెమెరా, 4K 60fps వీడియో రికార్డింగ్ సపోర్ట్.
Read Also:Criminals in Beggars: షాకింగ్..! బిచ్చగాళ్ల ముసుగులో క్రిమినల్స్..
ఏఐ ఆధారిత ప్రత్యేకతలు:
ఈ మొబైల్ లో అనేక ఏఐ ఆధారిత ప్రత్యేకతలు ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా..
* AI Editor 2.0: ఫొటో రీ-కంపోజ్, ప్రొఫెషనల్ ఫ్రేమింగ్.
* AI Perfect Shot: ముఖ లక్షణాలు గుర్తించి అత్యుత్తమ ఫోటో తయారు చేయడం.
* AI Livephoto 2.0: షటర్ ల్యాగ్ లేకుండా క్షణాలను క్యాప్చర్ చేసే ఫీచర్.
* Livephoto Export: క్లిప్ నుండి బ్లర్ లేని స్టిల్ ఇమేజ్ తయారీ.
* AI Flash Livephoto: లో-లైట్ లో డైనమిక్ ఫ్లాష్ అడ్జస్ట్మెంట్.
ఇతర ఫీచర్లు:
* ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్, ఇన్ఫ్రారెడ్ సెన్సార్, స్టీరియో స్పీకర్లు.
* USB Type-C ఆడియో, IP66 + IP68 + IP69 ధూళి, నీటి నిరోధకత.
* Wi-Fi 6, 5G SA/NSA, బ్లూటూత్ 5.4, నావిగేషన్ ఫుల్ సపోర్ట్.
ధర:
Oppo Reno 14 5G మూడు స్టోరేజ్ వేరియంట్లలో భారత మార్కెట్లో విడుదలైంది. ఎంట్రీ వేరియంట్ అయిన 8GB RAM + 256GB స్టోరేజ్ మోడల్ ధర రూ. 37,999గా ఉండగా.. దీని తరువాతి వేరియంట్ 12GB RAM + 256GB స్టోరేజ్ ధర రూ.39,999, ఇక టాప్-ఎండ్ వేరియంట్ 12GB RAM + 512GB స్టోరేజ్ ధర రూ.42,999గా నిర్ణయించారు. ఈ ఫోన్ ఫారెస్ట్ గ్రీన్ (Forest Green), పెర్ల్ వైట్ (Pearl White) రెండు ఆకర్షణీయమైన రంగుల్లో లభ్యమవుతోంది.