అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్ష పీఠాన్ని అధిష్టించారు. అధికారంలోకి రాగానే వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ట్రంప్ అమెరికాకు పునర్ వైభవం తీసుకురావాలని కోరుకుంటున్నారు. కానీ పెరుగుతున్న అప్పును నియంత్రించడంలో ఆయన ఘోరంగా విఫలమయ్యారు. ఎకానమిక్స్ టైమ్స్ నివేదిక ప్రకారం.. ఈ ఏడాది అమెరికా అప్పు $40 బిలియన్లకు చేరుకుంటుందని అంచనా. 2020 ప్రారంభంలో ఈ అప్పు $23.2 ట్రిలియన్లు ఉండేది. అంటే, గత 5 సంవత్సరాలలో సుమారు $17 ట్రిలియన్ల అప్పు పెరిగింది. అమెరికా చరిత్రలో ఇదే గరిష్ట అప్పుగా చెబుతున్నారు. ఆ దేశ ఆదాయంలో ఎక్కువ భాగం దాని వడ్డీని చెల్లించడానికే ఖర్చు అవుతోంది.
READ MORE: Kharge Serious On MLAs: ఎమ్మెల్యేల వ్యవహార శైలిపై ఖర్గే సీరియస్.. గ్రూపులు కడితే భయపడేది లేదు..
ఒక వైపు, అమెరికా అప్పు పెరుగుతోంది. మరోవైపు.. సమాఖ్య ప్రభుత్వ వ్యయం( కేంద్ర & రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చేసే వ్యయం) పెరుగుతోంది. 1900 సంవత్సరంలో ఈ వ్యయం జీడీపీలో కేవలం 3.14 శాతంగా ఉండేది. 1950లో 13.83 శాతానికి పెరిగింది. 2000 ఏడాది యూఎస్ సమాఖ్య ప్రభుత్వ వ్యయం దేశ జీడీపీలో 17.53 శాతం కాగా.. తాజాగా 2025 నాటికి 23.87 శాతానికి చేరుకుంది. ఈ వ్యయాన్ని తగ్గించడానికి ట్రంప్ ప్రభుత్వం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. దీని బాధ్యత ఎలాన్ మస్క్ కు ఇచ్చారు. కానీ ప్రస్తుతం ట్రంప్, మస్క్ కు మధ్య విభేధాల నేపథ్యంలో ఆ వ్యవస్థ గాడిన పడింది!
READ MORE: Cyberabad Police: స్పా సెంటర్లకు ఇక దబిడి దిబిడే.. హెచ్చరికలు జారీచేసిన పోలీసులు
మరోవైపు.. అమెరికాలో ప్రభుత్వ ఆదాయం తగ్గుతోంది. ఖర్చు వివరీతంగా పెరుగుతోంది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు, జాతీయ భద్రతకు మంచిది కాదని నిపుణులు అంటున్నారు. వడ్డీ చెల్లింపుల కోసం అమెరికా రోజుకు దాదాపు 2 బిలియన్ డాలర్లు ఖర్చు చేయాల్సి వస్తుంది. దీని కారణంగా, ప్రభుత్వం పరిశోధన, అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, విద్య, సామాజిక భద్రతపై ఖర్చును తగ్గించే అవకాశం ఏర్పడనుందని చెబుతున్నారు.