Off The Record: 2024 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయి… కేవలం 11 అసెంబ్లీ సీట్లకు పరిమితమైన వైసీపీ…. ఈసారి మాత్రం ఛాన్స్ తీసుకోదల్చుకోవడం లేదట. అంత ఓటమిలో కూడా… 40 శాతం వరకూ ఓట్లు పడ్డ విషయాన్ని గుర్తుంచుకోవాలని, ఆ ఓట్ బ్యాంక్‌ని కాపాడుకుంటూ…. సహజంగా వచ్చే ప్రభుత్వ వ్యతిరేకతను క్యాష్ చేసుకోగలిగితే…. మళ్ళీ పవర్లోకి రావడం ఖాయమని లెక్కలేసుకుంటోందట పార్టీ అధిష్టానం. అదే సమయంలో… జమిలి ఎన్నికల గురించి కూడా వైసీపీలో సీరియస్‌గా చర్చ జరుగుతున్నట్టు సమాచారం. ఖచ్చితంగా జమిలి వస్తుందన్న నమ్మకంతో కార్యక్రమాలను డిజైన్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. దాంతో సంబంధం ఉందా లేదా అన్న సంగతి పక్కనబెడితే… పార్టీ అధ్యక్షుడు జగన్ ఇటీవల యాక్టివిటీ బాగా పెంచారు. పరామర్శ యాత్రలతో పాటు వరుసబెట్టి పార్టీ రివ్యూ మీటింగ్స్ నిర్వహిస్తున్నారాయన. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన మొదలైన పార్టీ సమావేశాలు.. జిల్లా అధ్యక్షులు, రీజినల్ కో ఆర్డినేటర్లు, పీఏసీ సభ్యుల మొదలు పార్టీ అనబంధ విభాగాల దాకా జరుగుతున్నాయి.
Read Also: Pakistan YouTube Ban: పాక్ న్యూస్ ఛానెల్స్, ఇన్‌స్టా ఖాతాలు భారత్‌లో తిరిగి ప్రత్యక్షం
అదే సమయంలో కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు ఆందోళనలు నిర్వహిస్తోంది పార్టీ. మిర్చి, పొగాకు రైతుల కోసం గుంటూరు, పొదిలి పర్యటనలు, వివిధ సందర్భాల్లో అరెస్ట్ అయిన వారికి పరామర్శల్లాంటివన్నీ ఇందులో భాగమేనంటున్నారు. ఇక వారంలో ఒకరోజు కేడర్.. లీడర్స్ ఎవరో ఒకరితో కచ్చితంగా జగన్ మీటింగ్స్‌గానీ, పర్యటనలు.. పరామర్శలు కానీ ఉండేలా ప్లాన్ చేస్తోంది వైసీపీ.. ఏం చేసినా… ఫైనల్ గా జనంలోకి త్వరగా రీచ్ అవ్వాలి అనేది పార్టీ వ్యూహంగా తెలుస్తోంది. అందుకు బలమైన కారణమే ఉందన్నది వైసీపీ వర్గాల అభిప్రాయం. పార్టీ అధినేత జగన్ సహా… పలువురు కీలక నేతలంతా 2027 చివర్లో.. లేదా 2028 మొదట్లో అయినా జమిలి ఎన్నికలు రావచ్చని నమ్ముతున్నారట. అందుకే…పార్టీ కార్యక్రమాల స్పీడ్ పెంచినట్టు చెప్పుకుంటున్నారు.
Read Also: Poonam Kaur: మరోసారి త్రివిక్రమ్ ను టార్గెట్ చేసిన పూనమ్
ఇటీవల పలు సమావేశాల్లో మాట్లాడిన జగన్…. పార్టీ లీడర్స్‌కు. కేడర్‌కు జమిలి సంకేతాలిచ్చారు. ఆ దిశగా అందరూ ముందుకు నడవాలని పిలుపునిచ్చి దిశానిర్దేశం చేస్తున్నారు. వైసీపీ కీలక నేత పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి కూడా ఇటీవలే జమిలి ఎన్నికలపై కామెంట్ చేశారు. 2027 ఫిబ్రవరిలోనే ఉంటాయని, వైసీపీ శ్రేణులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారాయన. ఈ విషయాన్ని ఓ కేంద్ర మంత్రి తనతో చెప్పారని కూడా పెద్దిరెడ్డి అనడం హాట్ టాపిక్ అయింది. జమిలి ఎన్నికల ప్రస్తావన చాలాకాలంగా ఉన్నప్పటికీ కేంద్రం నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు. ఇప్పుడు పెద్దిరెడ్డి లాంటి సీనియర్ నాయకుడు అలా మాట్లాడ్డంతో మళ్ళీ చర్చ మొదలైందట. ఓ వైపు పార్టీ నేతలతో వరుస సమావేశాలు, ఎన్ని ఆంక్షలు పెట్టినా ఆగని జగన్ పర్యటనలను సింక్ చేస్తే…. అందులో ఏదో పరమార్ధం ఉండొచ్చు అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పొలిటికల్ పండిట్స్. కచ్చితంగా జమిలి ఎన్నికల అంచనాతోనే వైసీపీ ఇక నుంచి టాప్ గేర్‌లో వెళ్లాలని భావిస్తుండవచ్చని అంచనా వేస్తున్నారు. ఒకవేళ ఇప్పటికిప్పుడు రాకపోయినా.. ఆ పేరుతో పార్టీ నేతలను సిద్దం చేస్తే… ఎలాగూ జగన్ 2.0 అంటున్నారు కాబట్టి..పార్టీని స్వింగ్‌లోకి తీసుకురావచ్చని అనుకుంటున్నారట. పెద్దిరెడ్డి లాంటి నాయకుడు ఎలాంటి సమాచారం లేకుండా జమిలిపై మాట్లడరని… అలా చూసుకున్నా… ముందు జాగ్రత్త మంచిదేనన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది వైసీపీ వర్గాల్లో.