My Baby : తమిళంలో రీసెంట్ గా వచ్చిన డిఎన్ ఏ మూవీ మంచి హిట్ అయింది. ఈ సినిమాను మై బేబి పేరుతో ఎస్. కె. పిక్చర్స్ ద్వారా ఈనెల 11న సురేష్ కొండేటి విడుదల చేస్తున్నారు. ‘ప్రేమిస్తే’, ‘జర్నీ’ ‘షాపింగ్ మాల్ ‘ ‘పిజ్జా’ లాంటి సూపర్ హిట్ సినిమాలను రిలీజ్ చేసిన సురేష్ కొండేటి ఇప్పుడు ఈ మూవీని తెలుగు ప్రేక్షకులకు అందించబోతున్నారు. ఇది కూడా సూపర్ హిట్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. అధర్వ మురళి, నిమిషా సజయన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను నెల్సన్ వెంకటేసన్ డైరెక్ట్ చేశారు.
Read Also : Allu Aravind : ఈడీ విచారణపై స్పందించిన అల్లు అరవింద్..
ఈ మూవీ క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కింది. మామూలుగా మనం హాస్పిటల్స్ లో పిల్లల్ని మాయం చెయ్యడం వారిని వేరే చోట అమ్మేయడం లాంటివి చూస్తుంటాం.. అయితే ఇలాంటి వాటి బ్యాక్ డ్రాప్ లోనే ఈ సినిమాను తెరకెక్కించారు. ఇలాంటి సమయంలో మనం ఏం చేయాలో ఈ మూవీ నేర్పిస్తుంది. సొసైటీలో ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ మూవీ చూపిస్తుంది. క్రైమ్ థ్రిల్లర్, భావోద్వేగ డ్రామాతో కూడిన ఈ సినిమా2014లో ఒక సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్ జీవితంలో జరిగిన దుర్ఘటనను బేస్ చేసుకుని తీశారు.