Vijayawada: ఈ మధ్యకాలంలో ప్రజలను మోసం చేసి డబ్బులు సంపాదించే వారి సంఖ్య రోజురోజుకు తిరుగుతోంది. ప్రజలకు మాయమాటలు చెప్పి వారి వద్ద నుండి దొరికినంత దోచేసుకొని వెళ్లే వ్యక్తుల సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది. రాష్ట్ర వ్యాపార రాజధానిగా పేరు పొందిన విజయవాడలో ఒక ఘరానా మోసం బయటపడింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
Read Also:ENG vs IND: అబ్బో.. జస్ప్రీత్ బుమ్రాతో చాలా కష్టం: బెన్ డకెట్
విజయవాడలోని వన్ టౌన్ శివాలయం వీధిలో గోల్డ్ వ్యాపారం చేస్తున్న ఏనుగుల వినోద్ పరార్ కావడం తీవ్ర చర్చనీయాంసంగా మారింది. అయితే, ఈ విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విజయవాడ పంట కాలువ రోడ్డులో ఏనుగుల చంద్రరావు కుటుంబ సభ్యులతో కలసి నివాసం ఉంటున్నారు. ఏనుగుల చంద్రరావు గత 50 సంవత్సరాలుగా విజయవాడ శివాలయం వీధిలో రజిని గోల్డ్ షాప్ పేరుతో వ్యాపారం చేస్తున్నారు. ఏనుగుల చంద్రరావు కి ముగ్గురు కుమారులు. ముగ్గురు కుమారులు తండ్రి వద్దనే గోల్డ్ వ్యాపారం చేస్తున్నారు. ఏనుగుల చంద్రరావుకు విజయవాడ గోల్డ్ మార్కెట్ లో మంచి పేరు ఉంది. అయితే ఆయన రెండో కుమారుడు ఏనుగుల వినోద్ తండ్రికి ఉన్న పేరును ఉపయోగించుకొని వ్యాపారస్తులను మోసం చేసాడు.
Read Also:RebaMonica : కొంటె చూపుతో ఫోజులిస్తూ మనసు దోచేస్తున్న మోనికా
గతంలో వీరిపై ఈడి అధికారులు దాడులు చేసి కొన్ని పత్రాలు స్వాధీనపరచుకొని రజిని గోల్డ్ షాప్ పేరుతో ఉన్న షాప్ ని సీజ్ చేశారు. ప్రస్తుతం విజయవాడ వన్ టౌన్ స్టేషన్ లో 650 గ్రాముల బంగారం తీసుకొని మోసం చేసాడని ఏనుగుల వినోద్ మీద బాధితుడు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఇంకా ఏనుగుల వినోద్ సంబంధిత చాలా మంది బాధితులు ఉన్నట్టు సమాచారం. ఏనుగుల వినోద్ కొన్ని మోడల్స్ కావాలని చెప్పి, విజయవాడ లోనే కాకుండా వివిధ ప్రాంతాల్లో పదుల సంఖ్యలో షాపుల దగ్గర బంగారం తీసుకొని పరారైనట్టు సమాచారం.