అమెరికాలో తుఫాన్ బీభత్సం సృష్టించింది. టెక్సాస్ వరదలతో వణుకుతోంది. ఆకస్మిక వరదల కారణంగా, గ్వాడాలుపే నది దాదాపు 45 నిమిషాల్లో 26 అడుగులు పెరిగి ఉదృతంగా ప్రవహిస్తోంది. వరద కారణంగా, తొమ్మిది మంది పిల్లలు సహా 43 మంది మరణించారు. అదే సమయంలో, వేసవి శిబిరం నుంచి 23 మంది బాలికలు సహా 27 మంది గల్లంతయ్యారు. తుఫాను సెంట్రల్ టెక్సాస్ మీదుగా కదులుతున్నందున మరిన్ని భారీ వర్షాలు, వరదలు సంభవించే అవకాశం ఉందని నేషనల్ వెదర్ సర్వీస్‌కు చెందిన జాసన్ రున్యాన్ వెల్లడించారు.
Also Read:Tragedy: ఐదేళ్ల పసిపాప దారుణ హత్య.. బాత్రూంలో రక్తపు మడుగులో శవమై కనిపించిన హితిక్ష
మిస్టిక్ క్యాంప్ వేసవి శిక్షణా శిబిరాన్ని వరద ముంచెత్తింది. అందులో 750 మంది పిల్లల బృందం ఉంది. మృతుల సంఖ్య పెరగవచ్చు. సెంట్రల్ కెర్ కౌంటీలో రాత్రిపూట 25 సెం.మీ వర్షం కురిసింది. తప్పిపోయిన బాలికల కోసం సహాయక బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయి. ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నారు. పడవలు, హెలికాప్టర్లతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. టెక్సాస్‌లోని కెర్ కౌంటీలో తీవ్ర వరదల తర్వాత 800 మందికి పైగా ప్రజలను రక్షించారు.
Also Read:PM Narendra Modi: బ్రెజిల్ చేరుకున్న ప్రధాని మోడీ.. 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి హాజరకానున్నారు
ఈ ఆపరేషన్ రాత్రిపూట కొనసాగిందని, రెండవ రోజు కూడా కొనసాగుతుందని టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ తెలిపారు. తొమ్మిది రెస్క్యూ బృందాలు, 14 హెలికాప్టర్లు, 12 డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సెంట్రల్ టెక్సాస్‌లో వరదలను “విపత్తు”గా అభివర్ణించారు. అవసరమైన సహాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. దక్షిణ-మధ్య టెక్సాస్ హిల్ కంట్రీలోని కెర్ కౌంటీలోని కొన్ని ప్రాంతాలకు యుఎస్ నేషనల్ వెదర్ సర్వీస్ ఆకస్మిక వరద అత్యవసర పరిస్థితిని ప్రకటించింది.