NTV Telugu Site icon

Kingdom : కింగ్‌డమ్ సినిమా రిలీజ్ డేట్ లాక్..!

Kingdom Movie Release Date, Vijay Deverakonda

Kingdom Movie Release Date, Vijay Deverakonda

విజయ్ దేవరకొండ కెరీర్‌లో తెరకెక్కుతున్న అత్యంత కీలకమైన చిత్రం ‘కింగ్‌డమ్’. గతంలో లైగర్, ఫ్యామిలీ స్టార్ వంటి  ఫ్లాప్స్ కారణంగా.. విజయ్ మార్కెట్‌ మీద చాలా ప్రభావం పడింది. ఈ నేపథ్యంలో ‘కింగ్‌డమ్’ ద్వారా తన కెరీర్‌ను మళ్లీ పైకి తీసుకెళ్లాలన్న నమ్మకంతో విజయ్ అడుగులు వేస్తున్నాడు. ఇక ఈ చిత్రానికి జెర్సీ వంటి హిట్‌ను అందించిన గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తుండగా, నిర్మాణ బాధ్యతలు సితార ఎంటర్టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ తీసుకున్నారు. విజయ్ దేవరకొండ కెరీర్‌లోనే ఇది అత్యధిక బడ్జెట్ కలిగిన పాన్ ఇండియా చిత్రం.

Also Read : Ye Maaya Chesave : ‘ఏ మాయ చేసావే’ ప్రమోషన్‌లో నేను లేను.. సమంత క్లారిటీ

ఇక ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై భారీ హైప్‌ను క్రియేట్ చేయగా. విజువల్స్‌, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, విజయ్ లుక్ అన్నీ కలిసి సినిమాపై పాజిటివ్ బజ్ తెచ్చాయి. అయితే, టీజర్ తర్వాత ఎలాంటి ప్రమోషనల్ మెటీరియల్ విడుదల కాలేదు. పాటలు, ట్రైలర్ లేదా మీడియా ఈవెంట్లపై ఎటువంటి అప్‌డేట్లు లేకపోవడం కొన్ని అనుమానాలు మొదలయ్యాయి. అయితే తాజాగా సమాచారం ప్రకారం, ‘కింగ్‌డమ్’ సినిమా 2025 జూలై 25న, శుక్రవారం విడుదల కానుందని ఓ వార్త వైరల్ అవుతుంది. అధికారికంగా ఈ విషయంపై మేకర్స్ ప్రకటించనప్పటికీ, ఆ డేట్‌కే సినిమాను ప్లాన్ చేశారని ఇండస్ట్రీ లోగాసిప్‌. పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతున్న ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలున్నాయి.

సాధారణంగా ఇలాంటి భారీ చిత్రాలు విడుదలకు రెండు నెలల ముందే సాంగ్స్, ఈవెంట్లు మొదలవుతాయి. కానీ ‘కింగ్‌డమ్’ మేకర్స్ ఇప్పటికీ ప్రమోషనల్ కార్యక్రమాలపై మౌనమే పాటిస్తున్నారు. ఫ్యాన్స్ మాత్రం చిత్రయూనిట్‌ నుంచి అధికారిక ప్రకటన కోసం ఆతురతగా ఎదురుచూస్తున్నారు. తన కెరీర్‌ను మళ్లీ నిలబెట్టుకోవాలనుకునే విజయ్ దేవరకొండకు ఈ సినిమా ఎంతో ముఖ్యం. మరి ఏం జరుగుతుందో చూడాలి.

OSZAR »