Off The Record: ఆంధ్రప్రదేశ్‌లో అధికార మార్పిడి జరిగి ఏడాది పూర్తయిపోయింది. ఈ టైంలో అమలైన హామీలు, జరిగిన పనుల గురించి విస్తృత చర్చ మొదలైంది రాష్ట్రంలో. ఆ చర్చ దిశగానే తెలుగుదేశం పార్టీ కూడా కార్యక్రమాలు రూపొందించుకుంటోంది. అయితే… రాజకీయంగా చూసుకుంటే… ఇది కూటమి పార్టీల మధ్య బాగా సున్నితమైన అంశంగా మారుతున్న సౌండ్ వినిపిస్తోందని అంటున్నారు పొలిటికల్ పండిట్స్. ఎన్నికల ప్రచారంలో సూపర్ సిక్స్ హామీలిచ్చింది టీడీపీ. అధికారంలోకి వచ్చాక వాటి అమలుపై దృష్టి సారించింది. హామీలు అమలవుతున్న క్రమంలో… ప్రజల్లోకి వెళుతూ ప్రచారం మొదలుపెట్టింది కూడా. ఇంటింటికి.. కార్యక్రమంలో వీటి గురించి పూర్తి స్థాయిలో వివరిస్తున్నారు పార్టీ కార్యకర్తలు. సరిగ్గా.. ఇక్కడే కొన్ని కొత్త ప్రశ్నలు వస్తున్నాయి. టీడీపీ సూపర్ సిక్స్ అమల్లో స్పీడ్‌గా ఉంది, అదే విషయాన్ని జనానికి చెప్పుకుంటోంది.
Read Also: Apache Helicopter : పాక్ సరిహద్దుకు ‘అపాచీ హెలికాప్టర్లు’..!
మరి కూటమిలో ఇంకో కీలక భాగస్వామి అయిన జనసేన సంగతేంటి? ఆ పార్టీ పాత్ర ఏమైంది. తాను సొంతగా ఇచ్చిన హామీల మాట ఏమైంది? వాటిని అమలు చేసేది ఎప్పుడంటూ రకరకాల ప్రశ్నలు వస్తున్నాయట. వాటి గురించి ఇప్పుడు ఆ పార్టీ ఎందుకు మాట్లాడ్డం లేదన్నది పలువురు పొలిటికల్ పరిశీలకుల డౌట్. వారాహి యాత్రల్లో పవన్ కళ్యాణ్ స్వయంగా హామీల గురించి ప్రస్తావించారు. సూపర్ సిక్స్ గురించి చెప్పడంతో పాటు జనసేన హామీలకు కూడా విస్తృత ప్రచారం కల్పించారాయన. నిరుద్యోగ యువతకు 10 లక్షల పెట్టుబడి సాయం, సీపీఎస్ రద్దు, ఉపాధి అవకాశాల కల్పన వంటి వాటి గురించి అప్పట్లో గళం వినిపించారు పవన్. అయితే ఇప్పుడు ఆ హామీల అమలు గురించి జనసేన అధిష్టానం ఎందుకు మాట్లాడ్డం లేదన్నది లేటెస్ట్ క్వశ్చన్. ఆ విషయంలో పార్టీ వైఖరి ఏంటి? అమలు కోసం కీలక భాగస్వామిగా.. ఎలాంటి వత్తిడి తీసుకువస్తోంది? పాలనకు ఏడాది పూర్తయిన క్రమంలో జనసేన హామీల గురించి ఎందుకు చర్చ జరగడం లేదని మాట్లాడుకుంటున్నాయి రాజకీయవర్గాలు.
Read Also: Apache Helicopter : పాక్ సరిహద్దుకు ‘అపాచీ హెలికాప్టర్లు’..!
అదే సమయంలో టీడీపీ మాత్రం అమలవుతున్న హామీలపై క్రెడిట్‌ను పూర్తిగా తన ఖాతాలో వేసుకుంటోందన్న అభిప్రాయం ఉంది. ఈ పరిణామాలతో జనసేన వెనక్కి తగ్గిందా? లేక తన హామీలను కూడా పూర్తిగా టీడీపీకి అప్పజెప్పేసిందా అన్న ప్రశ్నలు పొలిటికల్ పండిట్స్ మెదళ్ళలో మెదులుతున్నాయట. ఇక్కడే జనసేన ఉనికికి సంబంధించిన మాటలు కూడా వినిపిస్తున్నాయంటున్నారు. కూటమిలో భాగస్వామిగా ఉండి, హామీల అమలు విషయంలో తన పాత్రను స్పష్టంగా ప్రజల ముందు ఉంచకపోతే… గుర్తింపు ఎలా వస్తుందని జనసేనలోనే ఓ వర్గం మాట్లాడుకుంటున్నట్టు తెలుస్తోంది. పార్టీ ఇచ్చిన పది లక్షల పెట్టుబడి సాయం హామీపై ఇప్పటివరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదన్న విమర్శలు ఉన్నాయి. అలాగే…. సీపీఎస్ రద్దుపై కూడా ఆ పార్టీ తరపున ఎలాంటి వత్తిడి చేయడంలేదన్న అభిప్రాయం ఉంది.
Read Also: YS Jagan: వైఎస్ జగన్‌ను కలిసిన వైద్య విద్యార్థులు.. ఆందోళనకు మద్దతు తెలిపిన మాజీ సీఎం..
ఇన్నాళ్ళు మౌనంగా ఉన్న జనసేన ఇకనైనా తన వాగ్దానాల అమలుపై సీరియస్‌గా స్పందించకపోతే ప్రజల్లో పలుచన అయ్యే ప్రమాదం ఉందన్న హెచ్చరికలు వస్తున్నాయట పార్టీ పెద్దలకు. ఇచ్చిన హామీలు, అమలవుతున్న తీరుపై ఓవైపు టీడీపీ దూకుడుగా ముందుకు వెళుతుంటే…. అదే సమయంలో జనసేన మాత్రం తాన హామీల విషయంలో పట్టింపులేనట్టుగా ఉండటం రాజకీయంగా బాగా నష్టం చేస్తుందన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో కూడా పెరుగుతున్నట్టు తెలుస్తోంది. పథకాల అమలు క్రెడిట్ మొత్తం టీడీపీకేనా? ఆ విషయంలో మిగతా మిత్రపక్షాల పాత్ర ఉండదా? అసలు వాళ్ళ మేనిఫెస్టోల్లో ప్రస్తావించిన అంశాల సంగతేంటని కాస్త నిష్టూరంగానే మాట్లాడుకుంటున్నారట జనసేన నాయకులు కొందరు.