Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణను హైదరాబాద్ హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. ఈ కేసులో బీజేపీ తరఫు న్యాయవాది వాదనలు వినిపించేందుకు సమయం కోరడంతో, కోర్టు తదుపరి తేదీగా జూలై 8ను నిర్ణయించింది. ఈ కేసులో అసలు ముఖ్య అంశం ఏమిటంటే.. బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై పరువునష్టం దావా వేశారు. రేవంత్ రెడ్డి ఓ సభలో ప్రసంగిస్తూ, బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందని వ్యాఖ్యానించారని ఆరోపించారు.
Read Also:Prakash Reddy: యూరియాను ప్రభుత్వం బ్లాక్ మార్కెట్ కు తరలిస్తుంది.. బీజేపీ నేత సంచలన కామెంట్స్
ఈ వ్యాఖ్యల వల్ల బీజేపీ పార్టీ పరువు దెబ్బతిందని, ప్రజలలో అపోహలు కలిగేలా చేశాయని కాసం వెంకటేశ్వర్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన దావాను కొట్టేయాలని కోరుతూ సీఎం రేవంత్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కోర్టు విచారణ జరిపి తదుపరి వాదనలు వినేందుకు కేసును సోమవారానికి వాయిదా వేసింది. కేసు తదుపరి దశపై ఉత్కంఠ నెలకొంది. ఇది ఇలా ఉండగా..
Read Also:High Court: “I Love You చెప్పడంలో లైంగిక ఉద్దేశం లేదు”.. హైకోర్టు సంచలన తీర్పు..
గ్రూప్1 పిటీషన్లపై విచారణను హైకోర్టు వాయిదా వేసింది. దీనితో రేపు (జులై 3) న మరోసారి వాదనలు కొనసాగనున్నాయి. గ్రూప్1 మెయిన్స్‌లో అక్రమాలు చోటు చేసుకున్నాయని పిటీషన్లు వచ్చాయి. మళ్లీ మూల్యాంకనం చేయాలని లేదా మెయిన్స్ మరోసారి నిర్వహించాలని పిటీషన్ లో పేర్కొన్నారు.