కోల్‌కతాలోని ప్రతిష్టాత్మక లా కాలేజీలో విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారం ఘటన అందరినీ కలచివేసింది. ఈ కేసులో పట్టణ పోలీసులు నిందితులు మనోజిత్ మిశ్రా (31), జైబ్ అహ్మద్ (19), ప్రమిత్ ముఖోపాధ్యాయ అలియాస్ ప్రమిత్ ముఖర్జీ (20)లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడు మోనోజిత్ మిశ్రా మాజీ విద్యార్థి, టీఎంసీ స్టూడెంట్ వింగ్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు. వాస్తవానికి.. జూన్ 25న కళాశాల లోపల తనపై సామూహిక అత్యాచారం జరిగిందని బాధితురాలు స్థానిక పోలీసులకు తెలిపింది. రాత్రి 7:30 నుంచి రాత్రి 10:50 గంటల మధ్య నిందితులు తనపై అత్యాచారం చేశారని పేర్కొంది.
READ MORE: Minister Seethakka: మంత్రి సీతక్కకు మావోయిస్టుల వార్నింగ్.. లేఖపై స్పందించిన మంత్రి
అయితే.. ఈ సంఘటనపై కొన్ని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సాధారణంగా, రాష్ట్రంలోని ఏ కళాశాల అయినా సాయంత్రం 5 గంటలకు మూసివేస్తారు. కానీ.. ఈ విద్యార్థిని ఆ సమయంలో ఏం చేస్తుందనే ప్రశ్న ఉత్పన్నమైంది. అయితే.. బాధితురాలు పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం.. విద్యార్థి మండలి జనరల్ సెక్రటరీ పదవిని ఇప్పిస్తానని హామీ ఇచ్చి నిందితుడిలో ఒకడైన మోనోజిత్ మిశ్రా(31) విద్యార్థినిని కళాశాలకు రప్పించాడని తెలుస్తోంది. టీఎంసీ నాయకుడు విద్యార్థినిపై అత్యాచారానికి ఒడిగట్టాడని చెబుతున్నారు. అక్కడ ఉన్న మిగతా ఇద్దరు నిందితులు అతనికి సహాయం చేశారని తెలుస్తోంది. ఆ అమ్మాయి వ్యతిరేకించినా నిందితుడు కరుణించలేదు. తనకు బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడని ఆమె చెప్పినా.. అతడిని కూడా చంపేస్తానని బెదిరించాడని సమాచారం.
READ MORE: Occult worship: క్రికెట్ స్టేడియంలో క్షుద్ర పూజలు.. నిలిచిపోయిన టోర్నమెంట్..!
ఈ విషయంపై తృణమూల్ ఛత్ర పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు త్రినాంకూర్ భట్టాచార్య మాట్లాడుతూ.. “ఈ సంఘటన గురించి నాకు ఇంకా ఏమీ తెలియదు. ఈ ఘటన చేసింది టీఎంసీ నాయకుడైనా, ఎవరైనా నేరస్థులే. నిందితుడు కళాశాలకు సంబంధించిన అనేక కార్యకలాపాలలో పాల్గొన్నాడు. కానీ ప్రస్తుతం అతడికి తృణమూల్ ఛత్ర పరిషత్‌లో ఎలాంటి పదవి లేదు. నిందితుడు ఈ సంఘటనలో పాల్గొన్నట్లయితే.. ఎవరూ మళ్ళీ ఇలాంటి పని చేయని విధంగా కఠిన శిక్ష విధించాలి.” అని పేర్కొన్నారు.